19, ఆగస్టు 2014, మంగళవారం

విశాల విశ్వం నన్ను పిలుస్తుంది

విశాల విశ్వం నన్ను పిలుస్తుంది
హిమ నగం నన్ను శాసిస్తుంది
వింధ్య వంకరగా చూస్తుంది
శివుడు శివాలేత్తుతున్నాడు
యవ్వనం ఎందుకు
కామ కోరల్లో చీక్కడానిక
బాగా మెక్కడానిక


లేదు
వివేక వాణి వినుపించ్
భగత్ కోరిన బావితవ్యం చూపించు
సుబాష్ సాహసం నేర్పించు
మహాత్మా ఆత్మను ఆహ్వానించు
ఆవహించు
ఆలోచించు


నీ దేశం కోసం
ని కుటుంబం కోసం
ని కోసం
................





20, ఫిబ్రవరి 2014, గురువారం

ఓ వృక్షమా ...........(నా తెలంగాణా )

ఓ వృక్షమా ...........
ఎన్ని అవమానాలు
ని తోటి దే
నీతోనే పెరిగింది
నీవిచ్చిన నీరే తాగింది
వేరు ని చోటికి వచ్చింది
సహా జీవనం అనుకూన్నవ్
పరాన్న జీవనం అయింది
బయోలాజికల్ సైన్సు
సూత్రాలు చెప్పింది
మనుగడ కోసం పోరాటం
ని ఇంట్లోనే మొదలయోంది
అతిథిగా  వచ్చి
ని బిడ్డలనే ఎక్కిరించింది
పోనిలే నిడనిచ్చావ్
ని దానివన్నావ్
కానీ నిబిడ్డలను
పిక్కుతిన్నది
భుదేవివి నువ్వు
పిడికిలి బిగించావ్
కానీ ఎవరిని కొట్టలేదు
నిన్ను నువ్వు
ని బిడ్డలని
నీకు పూసిన పువ్వు వాటంతట
అవే రాలి పోయాయి
చుక్కలు అయ్యాయి
ఇన్నేళ్ళకి ఆశ ఫలించింది
ఏమో ఇది ట్వంటీ ట్వంటీ లా  ఉంది
ఏమి ఉహించాలేము
నీ బిడ్డలు నవ్వుతున్నారు
వారి రకతం తో పేజీలు  నింపారు
సత్య దూరం కాదిది
స్వప్నం అంతకన్నా కాదు
సత్యం
సాకారం  ........

5, డిసెంబర్ 2013, గురువారం

రాయలేను

రాయలేను స్త్రీ అంగాంగ సౌందర్యం
రాయలేను నాయక స్థుతి సుత్తి
రాయలేను రాజకీయ విశ్లేషణ
రాయలేను బౌతిక సూత్రాల అన్వయం దైవానికి
రాయలేను దేవుని మహిమలు
రాయలేను అనవసరపు విమర్శలు
రాయలేను చంద్రుడి మీద
రాయలేను నా ప్రేయసి మీద
శృంగార రసాస్వాదన చేయలేను
రాయాలి బక్కవాడి బొక్కల బాద
ప్రేయసి నిట్టూర్పులు వినే తీరిక లేదు
నక్కల మాటలు వినేంత ఓపిక లేదు
దైవం నాలోనే ఉన్నవాడు వాడికి స్వస్తుతి ఎందుకు
చంద్రుడు తనకేమీ తక్కువ
హైదరాబాద్ చాయ్ షాప్ సలీం భాయి గురించి రాయాలి
ముగ్గురు కొడుకులు
ఇద్దరు బిడ్డలు
చాయ్ షాప్
ఓనర్ ఒత్తిడి
అయిదింటికే లేవలే
సడువుకొమ్మని పంపిస్తే పైసలు కావలె అన్నాడు
మొన్ననే పక్క కొట్ట్టు కాళీ అయింది సేతుతో చెప్పలే కొడుకు కోసమని
ఆంజనేయులు ఇంటి పెయింటర్
అక్క పెళ్లి చెయ్యాలే
పాడుగాను కట్నం
అది వాళ్ళ కర్మం
పెద్ద కులం కదా
పేరు గొప్ప ఉరు దిబ్బ
హైదరాబాద్ దాటి మల్లన్న
పంట పాయిందట
విత్తనాలు నకిలివట
bt వేసాడు పత్తి బాగా వచ్చేట్టుంది
గొడ్డు ఆకూ తిన్నది
చనిపోయింది
పాడుగాను వంకయలో కూడా తెస్తారట
రాయగలను సామాన్యుడి ఆర్తనాదం
నన్ను పిలుస్తుంది నా దేశం
ఏది నా దేశం
భరతవనా?
కాదు పుడమితల్లి
పాకిస్తాను వాణ్ణి చంపలంటాడు భారతీయుడు
ఎందుకు అది మన సప్త సింధు నే కదా
రేపు రెండు కలిసి పోతే ని కోపం ఆఫ్ఘన్ పయిన
లేదే అది మన గందరమే కదా
చైనా మీదన మన జంబు ద్విపమే కదా
ఇంగ్లీష్ వాడా ?
మరున్డులు మ్లేచ్చులు కదా ?
ఇంకెవరు అమెరికన్లు అంటే
వాళ్ళు పిరికి వాళ్ళు
అందుకే యుద్ధోన్మాదం
పిరికి వాడు అరుస్తాడు
మతమా...........
చెపుతా విను

22, జూన్ 2013, శనివారం

అమ్మ అక్షరం



అమ్మ అక్షరం
మొదట నేను నేర్చిన అక్షరం అ
‘అ’ కాస్త అమ్మ అయింది
పదం బావం
బావం బందం
బందం రాగం
అనురాగం అయింది
ఇంతటి అక్షరానికి
అమ్మకి నేను ఏమి ఇవ్వగలను
కొంచెం ప్రేమని
కొండంత ధైర్యాన్ని
పుస్తకం లో జ్ఞానం
లోకం లో మంచితనం
తీయని మాట
కమ్మని వంట
తొలి అడుగు
తొలి వీడుకోలు
తొలి వేడుక
ఏది అయితేనేమి అన్ని అమ్మతోనే
అక్షరం తోనే

14, జూన్ 2013, శుక్రవారం

జగద్గురు ఆదిశంకరాచార్య



అద్వైతం అంటే ద్వితం కానిది అని అర్థం అంటే రెండుకాదు ఒకటే అని భగవంతుడు బక్తుడు  ఒక్కడే వేరుకాదు  అని చెప్పే సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం  బౌద్ధం నిరిశ్వర సిద్ధాంతం దేవుడు లేడని ఆ సమయాలసనాతన  ధర్మం (హైందవం ఒక మతం కాదు జీవన విదానం పరబ్రహ్మ సృష్టించిన విదానం)లో  పునరుద్దరణ కొరకు ఉద్భవించిన ఈశ్వరావతారమే ఆది శంకరాచార్యులు దేవుడిని దైవత్వాన్ని నిరూపించి సనాతన ధర్మం పునరుద్దరించి మానవజాతికి ఆద్యాత్మిక పరిమళాలు వెదజల్లిన పరమ పావన మూర్తి ఆయన జీవిత చరిత్ర గురించి జగద్గురు ఆదిశంకరాచార్య చలన చిత్రం విదులకు సిద్దంగా ఉంది అందరూ వీక్షించండి.........

13, జూన్ 2013, గురువారం

నాయకులము నాయికలము నరులము



పచ్చదనం అంటే నీకో పిచ్చి

తల్లిలాగా చూసుకుంటావు

తండ్రి లాగా పెంచుకుంటావు

కానీ చివరకు బాదగా అయిన కోస్తావు
అయిన ఎవరి కోసం అయిన నువ్వంటే మాకో చిన్న చూపు

రైతు అని
పల్లె అని
మా ఆధునిక జీవనానికి ప్రతికయినా చక్రం
నీ సృష్టే
నీ మనసు కలుషితం కాదంటారు
కానీ రసాయనాలతో చేసాం
నీవు అన్నపూర్ణ ప్రతిరూపంగా బావిస్తం
కానీ అన్నపూర్ణే బిక్షమ్దేహి అంటుంది
నీకు ఆశ ఐదు సంవత్సరాలకు ఒకసారి
ఆదుకుంటామని  కానీ
అపహరించుకుపొతం
మేమే ఈనాటి నాయకులము

నాయికలము

నరులము

23, మే 2013, గురువారం

నానిలు

వెదురు వేణువైతే 
వేశ్య వనిత 


మొన్న పరమాత్మా 
నిన్న యెహోవ 
నేడు అల్లాహ్ 
పేరే వేరు 


కోపానికి కారణం 
ప్రశ్న 
రాజుకైన నాయకునికైన 
అదే లేకొపోతే ?

మనకి మతం 
జంతువులకి ?
అడక్కండి 
దేవరహస్యం !

మాది మాలవాడ 
నీళ్ళలో నిషేధం 
కానీ మాకో గర్వం 
మా ఆడాళ్ళకి మా గాలికి  లేదు 

కోపం ఆడవాళ్ళకి 
ఓపిక మగాళ్ళకి 
లోపం మనుషులకి