నా అన్వేషణ నిశిది లో ఉదయం గురించి
విశాల జగతిలో శాంతి గురించి
తీరేనా
కల నేరేవేరేనా
ఏమో
స్వప్నం సాకారం అవుతుందేమో
సస్యశ్యామల జగతికి
బీజం పడుతుందేమో
సంధ్య లో నుండి ఉషోదయం ఉదయించ లేదా
నిశి రాతిరి గర్వం ఎంత సేపు
ఉషోదయం విజ్రుమ్బించే వరకే
కారుమబ్బుల గర్వం ఎంతసేపు
రవి రేఖలు విచ్చుకునే వరకే
అలల గర్వమెంతసేపు
అశాంతి..........
హింస.........
ఇవన్ని నిశి రాత్రులు
శాంతి ఉషోదయాలు......
baagundi
రిప్లయితొలగించండిthnk u
రిప్లయితొలగించండి