12, జనవరి 2013, శనివారం

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
            చాల రోజుల తర్వాత తెలుగుతెర పైన అచ్చ తెలుగు చిత్రం వచ్చింది అందరు చూడదగ్గ చిత్రం
వసుదయిక కుటుంబం అనే అంశాన్ని హృద్యంగా తెరకెక్కించిన దర్శకుడికి అభినందనలు ఈ చిత్రం లో
ప్రకాష్ రాజ్ తండ్రి పాత్ర పరిచయం అతనిలోని మంచితనాన్ని చుపెవిదంగా పరిచయం చేసాడు అందరిని కలుపుగోలుగా
పోయే మనస్తత్వం పెదవుల పైన చెరగని చిరునవ్వు,డబ్బు కాదు మంచి మనసు ముక్యం అని అనుకునే మనస్తత్వం
అన్నదమ్ముల అనుబందం నాకు నచ్చిన విదంగా ఉంటా అని హద్దుల్లో ఉండే వ్యక్తిత్వం పెద్దోడిది (వెంకటేష్)
అందరిని కలుపుకొని పోయే మాటలు నేర్చిన పాత్ర చిన్నోడిది(మహేష్ బాబు) ఇద్దరి అన్నదమ్ముల మద్య వచ్చే చిన్న
చిన్న తగాదాలు తర్వాత కలసిపోవడం తన కుటుంబాన్ని ద్వేషించే వ్యక్తి కూడా ప్రేమించేలా ప్రవర్తన సమాజానికి ప్రాథమిక రూపం కుటుంబం అనే 
సందేశాన్ని ఇచ్చిన మంచి చిత్రం సీత పాత్ర తన చుట్టే చిత్రం మొత్తం తిరుగుతుంది అంజలి నటన చాల బాగుంది మంచి తెలుగు నటి తెలుగు తెరకు దొరికింది
సమంతా తన పాత్రకు తగ్గ విదంగా నటించింది రావురమేష్ బాగా చేసాడు మొత్తనగా వసుదయిక కుటుంబం అనే సందేశాని ఇస్తూ సమాజం బాగుండాలంటే ముందుగ
కుటుంబం బాగుండాలి
అనే సందేశం
మొత్తంగా ప్రతి ఒక్కరు తప్పకుండ చూడవలిసిన చిత్రం ఇందులో అగ్ర నటులు కనబడరు పాత్రలు మాత్రమే కనబడుతాయి మన ఇంట్లో జరిగే సంగటనలు సమాహారం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు