30, ఏప్రిల్ 2013, మంగళవారం

అక్షరమా..................

అక్షరమా.................. 
రాసాను లేఖ న్నో నిన్ను వర్ణిద్దామని
ప్రయత్నించా  నే ఆస్వాదిద్దామని  ని 
సౌందర్యాన్ని 
నిశి రాతిరి లో ఉషోదయనివాయ్యవు 
భాగ్యనగరం లో చెట్టువలె 
భారతదేశం లో శాంతి వలే
నిద్దుర చెదిరి నిన్ను కలవరించిన వేళ 
నా  మనసు చెదిరి నిను అన్వేషించిన వేళ 
నీ  అన్వేషణ లో నన్ను నేను తెలుసుకున్న 
కారు చీకటిలో కనిపించే దీపమే దైవం  అన్నావు
 ఎన్ని సంద్యలు అస్వదించానో  నీ సారాన్ని పిల్చి 
ఒక దశలో నా స్నేహితులు హితులు బంధువులు 
రాబందువులు  అందరు నిన్ను వదిలేయమన్నారు 
ఎలా గాలి లేని జీవం ఉహించాగలమా 
నీరు లేని చేప బతకగలదా 
నిన్ను చెరక ముందు రాయిల ఉండేవాడిని 
తర్వాత శిల్పన్నాయ్యాను 
నీ సాంగత్యం లో సుతుల్ హితుల్ సన్నిహితుల్ 
వైరుల్ 
అందరూ సజ్జనులే 
అందరు శాంతి స్వరుపులే 
మా అమ్మ నేర్పిన దయాగుణం 
నాన్న నేర్పిన  ప్రేమతత్వం 
అన్నయ్యలు ఇచ్చిన  దైర్యం 
తమ్ముడు ఇచ్చిన బందం 
చెల్లెలు ఇచ్చిన అనురాగం 
స్నేహితుడి ఇచ్చిన సంతోషం 
శత్రువు ఇచ్చిన సలహాలు 
ప్రియురాలు పంపిన సరస గీతాలు 
అన్ని నువవిచ్చావు 
ఓటమి లో దైర్యం 
గెలుపుని తలకేక్కించలేదు 
రెంటిని ఒకేలా చూడు అన్నావు 
నేన్ను ఎలా వర్ణించను నిన్ను తూచే 
అక్షరాల కోసం అక్షరమాల వెతికాను 
అక్షరం కోసం అక్షరాన్ని వెతకడం ఏమిటే అనుకొన్నాను 
నిన్ను తుచడం నాకు తెలియదు 
నాకే కాదు ఎవరికీ తెలియదు 
నివ్వు లేనిదే కవి కాలేడే 
నివ్వు లేనిదే పాట సౌందర్యం లేదే 
నివు లేని ఈ సమస్తం 
వ్యర్థం 






 అక్షరమా 
ఈ విశ్వం లో రెండింటిని నమ్ముకున్నవాడు 
చెడిపోయినట్టు చరిత్రలో లేదు 
భూమి,అక్షరం 
భుసేద్యం  
అక్షర సేద్యం 
అవని.............. 
అక్షరమా............ 
 నీకు నా పాదాభివందనాలు 
పదాబివందనలు ..............