23, మే 2013, గురువారం

నానిలు

వెదురు వేణువైతే 
వేశ్య వనిత 


మొన్న పరమాత్మా 
నిన్న యెహోవ 
నేడు అల్లాహ్ 
పేరే వేరు 


కోపానికి కారణం 
ప్రశ్న 
రాజుకైన నాయకునికైన 
అదే లేకొపోతే ?

మనకి మతం 
జంతువులకి ?
అడక్కండి 
దేవరహస్యం !

మాది మాలవాడ 
నీళ్ళలో నిషేధం 
కానీ మాకో గర్వం 
మా ఆడాళ్ళకి మా గాలికి  లేదు 

కోపం ఆడవాళ్ళకి 
ఓపిక మగాళ్ళకి 
లోపం మనుషులకి 







8, మే 2013, బుధవారం

శ్రీ శ్రీ


శ్రీ శ్రీ 
తెలుగు ప్రజలలో ఈ పేరు తెలియని వారుండరేమో 
నేను మొట్ట మొదట చదివిన పుస్తకం కన్యాశుల్కం అది మా నాన్న నా చిన్నప్పుడు తెచ్చుకున్నాడు 
వేల 35 రూపాయలు ఆ పుస్తకం అప్పుడు నాకు అర్థం కాలేదు 
కొన్ని సంవత్సరాల తర్వాత ఒక రోజు నాకో అధ్బుత నిది దొరికింది అదే "మహాప్రస్థానం"
ప్రపంచాగ్నినికి సమిదనోక్కటి గేయం గురించి వెతికాను కానీ అందులో యోగ్యతా పత్రం చలం రాసింది 
అది చదివాను అందులో చలం గారు ఒక మాట చెపుతారు ఈ పుస్తకం చదవండి ఏమి అర్థం కాలేదా ఎ యువకుడికో బిక్షకుడికో డెత్-బెడ్ ప్రెసెంట్ గ పంపండి పారెయ్యకండి దాచుకోకండి ........... ఇది అంత గొప్ప శక్తి ఉన్న పుస్తకం 
ఈ పుస్తకం కొంపెల జనార్దనరావు కి అంకితమిచ్చాడు వీరిద్దరి అనుబందం గురించి "అనంతం" లో చెప్పాడు 
మహాప్రస్థానం గేయం మరో ప్రపంచం "
మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది
 పదండి ముందుకు 
పదండి దుసుకు 
పదండి పోదాం ఫై పైకి 
.............. .......... 
.......... ........... 
కనబడ లేదా అగ్నికిరీటపు దగదగలు 
ఎర్రభావుట నిగనిగలు 
హోమజ్వలభుగాభుగాలు? 
విప్లవ రాజ్యం  కాంక్షించే ప్రతి వాడి రక్తం లో మొదటి పేజి నుండే ఎక్కుద్ది 
నెనెఉ సైతం ఇలా ఎన్నో చెపుతాడు 
ప్రతి గేయం ప్రతి అక్షరం కమ్యునిజం కొరకే 
కుక్కపిల్ల సబ్బుపిల్ల అగ్గిపుల్ల కాదేది కవితకనర్హం 
నిరుద్యోగి బడని పలుకుతాడు 
కూటికోసం,కులికోసం 
ఒక్కసారి బాల్యాన్ని గుర్తుకు తెస్తాడు 
వన మబ్బు మెరుపు ఏదయినా మీ గురించే అనుకునే కునల్లర తనది సందిట తల్లి కుగిట దేహదులితో 
పర్మత్మల్లారా 
రుతువులన్ని క్రిదించేవి మీ కోసమే అంటదు రేపటి విధాతలు మీరే అంటాడు
భిక్షువర్గియాసి లో సామ్రాజ్యవాదం దనవ్యవస్థ  బిక్షవ్రుత్థికిఒ కారణం అంటుంది 
శరచ్చంద్రిక లో వెన్నెల గురించి చెపుతాడు 
మనిషికి రెండు నమ్మ్కలున్దేవి ఒకటి అదృష్టం 
రెండవది మతం 
దానికో ఆత్మ ఉండేదట 
ప్రతి మానవుడికి ఒక గుండె ఒక కర్జం(కాలేయం) ఒక జెండా ఉండేవి 
ఇవి వాణి ప్రదనంగాలు మనవ నిజం రెండుగా చిలింది ఒకటి మగ ఆలోచించడం అంటేనే అసహ్యం 
రెండవది ఆడ దానికి అసలు ఆలోచించ నిచ్చారు కాదు 
దేవుణ్ణి మానవుడి మనస్సుని గెలిస్తే నేను లేను నన్ను తనే సృష్టించాడు సిప్రాలి కథలు అనువాద కవితలు గర్జించు రష్యా 
ఇలా రాసిన శ్రీ శ్రీ 
దేవుడు లేడంటాడు 
ఆత్మ లేదంటాడు 
తన మనోగతాన్ని తన     
కవితల్లో ఆవిష్కరించాడు 
శ్రీ శ్రీ జయంతి సందర్బంగా చిన్న సంపుటి 

కన్నీటిని

ఈ మద్యనే పాలబుగ్గల పసివాళ్ళు నన్ను అడిగారు 
ఎవరు నువ్వు?
కన్నీటిని 
ఎక్కడ ఉంటావు?
పేదవాడి అరుపులో 
ఉద్యమకారుడి ఆశయం లో 
విద్యార్ధి లక్ష్యం లో 
అమ్మ ప్రేమ లో 
నాన్న అప్యాయతలో 
అన్న అనురాగం లో 
బందం లో 
అనుబందం లో 
కష్టం,
నష్టం,
సుఖం,
దుఃఖం 
బాధ బరువైనపుడు 
ఆనందం అదికం 
సందర్బం ఎదయితేనేమి 
నేను ఉంటాను 
మీ ఊరు ?
అశ్రుననయనపురం 
ని తల్లి తండ్రులు ?
చెప్పగా సుఖం దుఃఖం 
ఎక్కువగా ఎవరివద్ద ఉంటావు?
నాకు మీలాగా 
కుల వర్గ జాతి వర్ణ వైషమ్యాలు  లేవు 
బక్కోని  కష్టం లో 
బలిసినోని సుఖం లో 
ఎప్పుడెప్పుడు అత్తవు ?
మొన్నే ఐదేండ్ల పిల్ల ఫైన 
అఘాయిత్యం చేసిండ్రు 
అపూడు గ పొల్ల కండ్లల్ల 
వాని ఇంట్ల గూడా 
అంతకు ముందు 
కొడుకు విడిచిన తల్లి 
డబ్బు కోసం పీడించ బడుతున్న తండ్రి 
రాయికి ముగాజీవాలని బలి ఇస్తున్న మూడుల్ని 
మత గజ్జి తో కొట్టుకు పోతున్న చాందసవాదం 
దేవుని పేరుతో చేసే హింస 
మాయమైన బందాలని 
మరిచి పోయిన మానవత్వాన్ని 
ఒక బాధలోనే వస్తావా?
లెదు సంతోషం లో కూడా 
ఆనందం అదికమయినపుడు 
దేవుణ్ణి మనిషిలో చూసినపుడు 
సంధ్య రాగం 
కోయిల పాట 
వసంతగీతం 
సైనికుడి విజయం 
స్వాతంత్రం 
స్వతంత్రం 
............ 
ఎపుడు వెళ్తావ్?
జీవి మనుగూడ ఉన్నంతవరకూ 
నివు లేకపోతే?
నేను లేకపోతే మీకు ఆనందం ఉండదు 
వస్తాను మరి మల్లి కలుద్దాం ఇంకా చాల మాట్లాడుకుందాం 
ఎవరో దీనుడు నా కోసం దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నాడు వేల్లోస్త!.......