22, జూన్ 2013, శనివారం

అమ్మ అక్షరం



అమ్మ అక్షరం
మొదట నేను నేర్చిన అక్షరం అ
‘అ’ కాస్త అమ్మ అయింది
పదం బావం
బావం బందం
బందం రాగం
అనురాగం అయింది
ఇంతటి అక్షరానికి
అమ్మకి నేను ఏమి ఇవ్వగలను
కొంచెం ప్రేమని
కొండంత ధైర్యాన్ని
పుస్తకం లో జ్ఞానం
లోకం లో మంచితనం
తీయని మాట
కమ్మని వంట
తొలి అడుగు
తొలి వీడుకోలు
తొలి వేడుక
ఏది అయితేనేమి అన్ని అమ్మతోనే
అక్షరం తోనే

14, జూన్ 2013, శుక్రవారం

జగద్గురు ఆదిశంకరాచార్య



అద్వైతం అంటే ద్వితం కానిది అని అర్థం అంటే రెండుకాదు ఒకటే అని భగవంతుడు బక్తుడు  ఒక్కడే వేరుకాదు  అని చెప్పే సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం  బౌద్ధం నిరిశ్వర సిద్ధాంతం దేవుడు లేడని ఆ సమయాలసనాతన  ధర్మం (హైందవం ఒక మతం కాదు జీవన విదానం పరబ్రహ్మ సృష్టించిన విదానం)లో  పునరుద్దరణ కొరకు ఉద్భవించిన ఈశ్వరావతారమే ఆది శంకరాచార్యులు దేవుడిని దైవత్వాన్ని నిరూపించి సనాతన ధర్మం పునరుద్దరించి మానవజాతికి ఆద్యాత్మిక పరిమళాలు వెదజల్లిన పరమ పావన మూర్తి ఆయన జీవిత చరిత్ర గురించి జగద్గురు ఆదిశంకరాచార్య చలన చిత్రం విదులకు సిద్దంగా ఉంది అందరూ వీక్షించండి.........

13, జూన్ 2013, గురువారం

నాయకులము నాయికలము నరులము



పచ్చదనం అంటే నీకో పిచ్చి

తల్లిలాగా చూసుకుంటావు

తండ్రి లాగా పెంచుకుంటావు

కానీ చివరకు బాదగా అయిన కోస్తావు
అయిన ఎవరి కోసం అయిన నువ్వంటే మాకో చిన్న చూపు

రైతు అని
పల్లె అని
మా ఆధునిక జీవనానికి ప్రతికయినా చక్రం
నీ సృష్టే
నీ మనసు కలుషితం కాదంటారు
కానీ రసాయనాలతో చేసాం
నీవు అన్నపూర్ణ ప్రతిరూపంగా బావిస్తం
కానీ అన్నపూర్ణే బిక్షమ్దేహి అంటుంది
నీకు ఆశ ఐదు సంవత్సరాలకు ఒకసారి
ఆదుకుంటామని  కానీ
అపహరించుకుపొతం
మేమే ఈనాటి నాయకులము

నాయికలము

నరులము