8, మే 2013, బుధవారం

కన్నీటిని

ఈ మద్యనే పాలబుగ్గల పసివాళ్ళు నన్ను అడిగారు 
ఎవరు నువ్వు?
కన్నీటిని 
ఎక్కడ ఉంటావు?
పేదవాడి అరుపులో 
ఉద్యమకారుడి ఆశయం లో 
విద్యార్ధి లక్ష్యం లో 
అమ్మ ప్రేమ లో 
నాన్న అప్యాయతలో 
అన్న అనురాగం లో 
బందం లో 
అనుబందం లో 
కష్టం,
నష్టం,
సుఖం,
దుఃఖం 
బాధ బరువైనపుడు 
ఆనందం అదికం 
సందర్బం ఎదయితేనేమి 
నేను ఉంటాను 
మీ ఊరు ?
అశ్రుననయనపురం 
ని తల్లి తండ్రులు ?
చెప్పగా సుఖం దుఃఖం 
ఎక్కువగా ఎవరివద్ద ఉంటావు?
నాకు మీలాగా 
కుల వర్గ జాతి వర్ణ వైషమ్యాలు  లేవు 
బక్కోని  కష్టం లో 
బలిసినోని సుఖం లో 
ఎప్పుడెప్పుడు అత్తవు ?
మొన్నే ఐదేండ్ల పిల్ల ఫైన 
అఘాయిత్యం చేసిండ్రు 
అపూడు గ పొల్ల కండ్లల్ల 
వాని ఇంట్ల గూడా 
అంతకు ముందు 
కొడుకు విడిచిన తల్లి 
డబ్బు కోసం పీడించ బడుతున్న తండ్రి 
రాయికి ముగాజీవాలని బలి ఇస్తున్న మూడుల్ని 
మత గజ్జి తో కొట్టుకు పోతున్న చాందసవాదం 
దేవుని పేరుతో చేసే హింస 
మాయమైన బందాలని 
మరిచి పోయిన మానవత్వాన్ని 
ఒక బాధలోనే వస్తావా?
లెదు సంతోషం లో కూడా 
ఆనందం అదికమయినపుడు 
దేవుణ్ణి మనిషిలో చూసినపుడు 
సంధ్య రాగం 
కోయిల పాట 
వసంతగీతం 
సైనికుడి విజయం 
స్వాతంత్రం 
స్వతంత్రం 
............ 
ఎపుడు వెళ్తావ్?
జీవి మనుగూడ ఉన్నంతవరకూ 
నివు లేకపోతే?
నేను లేకపోతే మీకు ఆనందం ఉండదు 
వస్తాను మరి మల్లి కలుద్దాం ఇంకా చాల మాట్లాడుకుందాం 
ఎవరో దీనుడు నా కోసం దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నాడు వేల్లోస్త!....... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి