5, డిసెంబర్ 2013, గురువారం

రాయలేను

రాయలేను స్త్రీ అంగాంగ సౌందర్యం
రాయలేను నాయక స్థుతి సుత్తి
రాయలేను రాజకీయ విశ్లేషణ
రాయలేను బౌతిక సూత్రాల అన్వయం దైవానికి
రాయలేను దేవుని మహిమలు
రాయలేను అనవసరపు విమర్శలు
రాయలేను చంద్రుడి మీద
రాయలేను నా ప్రేయసి మీద
శృంగార రసాస్వాదన చేయలేను
రాయాలి బక్కవాడి బొక్కల బాద
ప్రేయసి నిట్టూర్పులు వినే తీరిక లేదు
నక్కల మాటలు వినేంత ఓపిక లేదు
దైవం నాలోనే ఉన్నవాడు వాడికి స్వస్తుతి ఎందుకు
చంద్రుడు తనకేమీ తక్కువ
హైదరాబాద్ చాయ్ షాప్ సలీం భాయి గురించి రాయాలి
ముగ్గురు కొడుకులు
ఇద్దరు బిడ్డలు
చాయ్ షాప్
ఓనర్ ఒత్తిడి
అయిదింటికే లేవలే
సడువుకొమ్మని పంపిస్తే పైసలు కావలె అన్నాడు
మొన్ననే పక్క కొట్ట్టు కాళీ అయింది సేతుతో చెప్పలే కొడుకు కోసమని
ఆంజనేయులు ఇంటి పెయింటర్
అక్క పెళ్లి చెయ్యాలే
పాడుగాను కట్నం
అది వాళ్ళ కర్మం
పెద్ద కులం కదా
పేరు గొప్ప ఉరు దిబ్బ
హైదరాబాద్ దాటి మల్లన్న
పంట పాయిందట
విత్తనాలు నకిలివట
bt వేసాడు పత్తి బాగా వచ్చేట్టుంది
గొడ్డు ఆకూ తిన్నది
చనిపోయింది
పాడుగాను వంకయలో కూడా తెస్తారట
రాయగలను సామాన్యుడి ఆర్తనాదం
నన్ను పిలుస్తుంది నా దేశం
ఏది నా దేశం
భరతవనా?
కాదు పుడమితల్లి
పాకిస్తాను వాణ్ణి చంపలంటాడు భారతీయుడు
ఎందుకు అది మన సప్త సింధు నే కదా
రేపు రెండు కలిసి పోతే ని కోపం ఆఫ్ఘన్ పయిన
లేదే అది మన గందరమే కదా
చైనా మీదన మన జంబు ద్విపమే కదా
ఇంగ్లీష్ వాడా ?
మరున్డులు మ్లేచ్చులు కదా ?
ఇంకెవరు అమెరికన్లు అంటే
వాళ్ళు పిరికి వాళ్ళు
అందుకే యుద్ధోన్మాదం
పిరికి వాడు అరుస్తాడు
మతమా...........
చెపుతా విను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి